News March 5, 2025
భూపాలపల్లి: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

మహాముత్తారం మండలానికి చెందిన ఓ బాలికపై 2019లో అత్యాచారానికి పాల్పడ్డ కేసులో మంగళవారం నిందితుడు అట్టెం మల్లయ్యకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానాను విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.నారాయణబాబు తీర్పు ఇచ్చారు. ఈ కేసులో జిల్లా స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విష్ణువర్ధన్ రావు వాదనలు వినిపించగా పోలీసులు సాక్షాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడికి శిక్ష పడింది.
Similar News
News March 19, 2025
ఎగుమతుల పెంపునకు కృషి: మంత్రి కొండపల్లి

విశాఖలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ సాధికారత సదస్సులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. MSME రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. MSMEలు రాష్ట్రంలో ఉపాధి పెంపుదల,ఆర్థిక వృద్ధికి మూలస్తంభాలన్నారు. కేంద్ర ప్రభుత్వ Viksit Bharat 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన వ్యూహాలను రూపొందిస్తున్నామన్నారు.
News March 19, 2025
ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్ కొత్త రూల్స్

ఏప్రిల్ 1 నుంచి TDS(మూలం వద్ద పన్నుకోత) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సీనియర్ సిటిజన్ల FD, RDపై వార్షిక ఆదాయం రూ.లక్ష వరకు ఉంటే TDS వర్తించదు. ప్రస్తుతం రూ.50వేల వరకే ఉంది. అలాగే సాధారణ ప్రజల వడ్డీ ఆదాయం రూ.50వేలు మించకుండా ఉంటే దానిపై బ్యాంకులు TDS కట్ చేయవు. బీమా ఏజెంట్లు, స్టాక్ బ్రోకర్లకు వార్షిక కమిషన్ ఆదాయం రూ.15,000 మించితే TDS వర్తించేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.20,000కు పెంచారు.
News March 19, 2025
నెన్నెల: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు SIప్రసాద్ తెలిపారు. SI వివరాల ప్రకారం.. నెన్నెల మండలం చిత్తాపూర్‌కు చెందిన రాజ్‌కుమార్ నిత్యం తాగొచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. మార్చి 14న తాగి వచ్చి భార్య లావణ్యతో గొడవ జరగడంతో ఆమె తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో రాజ్‌కుమార్ గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా రాత్రి మరణించాడు.