News January 30, 2025
భూపాలపల్లి: బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ మండల కమిటీల నియామకం

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కన్వీనర్ క్యాతం మహేందర్ ఆధ్వర్యంలో మండల కమిటీల నియామకం జరిగింది. రేగొండ మండలం అధ్యక్షుడిగా బండి రమేశ్, టేకుమట్ల మండలాధ్యక్షుడిగా చిలక సమ్మయ్య, మహముత్తారం మండలాధ్యక్షుడిగా కృష్ణను నియమించి వారికి నియామక పత్రాలను అందించినట్లు మహేందర్ తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ముందుకు వెళ్లాలన్నారు.
Similar News
News November 8, 2025
అరుదైన రికార్డుకు అడుగు దూరంలో బుమ్రా

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. మరో వికెట్ తీస్తే మూడు ఫార్మాట్లలో 100కు పైగా వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలవనున్నారు. అలాగే టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్ కానున్నారు. 50 టెస్టుల్లో 226, 89 వన్డేల్లో 149, 79 టీ20ల్లో 99 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. కాగా ఆసీస్, ఇండియా మధ్య చివరిదైన ఐదో టీ20 రేపు జరగనుంది.
News November 8, 2025
ముండ్లమూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ముండ్లమూరు మండలం వేంపాడు-పోలవరం మధ్యలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అద్దంకి నుంచి వస్తున్న ఇద్దరు యువకులు ట్రాక్టర్ను క్రాస్ చేసే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. చాట్ల వంశీ అక్కడికక్కడే మృతి చెందగా, షేక్ సుభానిని 108లో అద్దంకి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 8, 2025
గీసుకొండ: గంజాయి విక్రయం.. నలుగురు యువకులు అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. భోగి నవీణ్, కటకం కళ్యాణ్ @ పాల్ దినాకర్, అరవింద్, మహేశ్ గంజాయి, మద్యం జల్సాలకు అలవాటు పడ్డారు. HYDలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి 145గ్రా. ఎండు గంజాయి కొనుగోలు చేసి, విక్రయించేందుకు ధర్మారం ఊరచెరువు సమీపంలో సంచరిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని తెలిపారు.


