News March 5, 2025
భూపాలపల్లి: భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

కొడవటంచలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈనెల 9 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. దేవాలయాన్ని విద్యుద్దీకరణ చేయడంతో పాటు, పూలతో అలంకరించాలని సూచించారు.
Similar News
News November 17, 2025
కామారెడ్డి: పెరుగుతున్న చలి.. బీబీపేటలో కనిష్ఠం

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. బీబీపేట 8.5°C, గాంధారి 9, డోంగ్లి 9.1, నస్రుల్లాబాద్ 9.2, లచ్చపేట 9.3, బొమ్మన్ దేవిపల్లి, మేనూర్, సర్వాపూర్లలో 9.4, బీర్కూర్ 9.5, దోమకొండ 9.6, రామలక్ష్మణపల్లి, జుక్కల్ 9.8, ఎల్పుగొండ 9.9, బిచ్కుంద, రామారెడ్డిలలో 10.2°C లుగా రికార్డ్ అయ్యాయి.
News November 17, 2025
HYD: iBOMMA రవి అరెస్ట్పై సీపీ ప్రెస్మీట్

iBOMMA రవి అరెస్ట్పై నేడు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి సినీ హీరోలు, నిర్మాతలు హాజరుకానున్నారు. ఇప్పటికే ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ పోలీసులు బ్లాక్ చేశారు. ‘ఐబొమ్మ’ను నడుపుతూ క్రికెట్ బెట్టింగ్ సైట్లు ప్రమోట్ చేసి రవి రూ.కోట్లు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. రవిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే.
News November 17, 2025
నువ్వుల పంట కోతకు వచ్చిందా?

తెలుగు రాష్ట్రాల్లో ఆగష్టు నెలలో విత్తుకున్న నువ్వుల పంట ప్రస్తుతం కోత మరియు నూర్పిడి దశలో ఉంటుంది. పంటలో 75% కాయలు లేత పసుపు రంగులోకి వచ్చినప్పుడే పైరును కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ 8 శాతానికి తగ్గేవరకు చూసుకోవాలి. ఆ తరువాతే గోనె సంచిలో నిల్వ చేయాలి. ఈ సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలి.


