News April 4, 2025

భూపాలపల్లి: యువతపై కన్నేసి ఉంచాలి!

image

భూపాలపల్లి జిల్లాలో విద్యార్థులు, యువతపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు, మేధావులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ముగియడంతో పిల్లల కదలికలు, అలవాట్లు, మొబైల్ వాడకంపై నిఘా పెట్టాలంటున్నారు. జిల్లాలో ఇప్పటికే గంజాయి, బోనోఫిక్స్, మద్యం వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడుతున్నారని, వ్యసనంగా మారి అనర్థాలకు దారి తీయకముందే అదుపు చేయాలని కోరుతున్నారు.

Similar News

News April 5, 2025

పాలమూరు నేతలతో KCR మీటింగ్.. BRS శ్రేణుల్లో జోష్..!

image

ఏప్రిల్ 27న వరంగల్‌లో BRS భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో MBNR, GDWL, NRPT, NGKL, WNP జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ MLAలు,ఇతర ముఖ్య నేతలతో ఈరోజు మాజీ సీఎం KCR సమావేశం నిర్వహించారు. జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న KCR ప్రజాక్షేత్రంలోకి వస్తుండడంతో BRSశ్రేణుల్లో జోష్ నిండింది. భారీగా సభకు తరలివెళ్లి పాలమూరు సత్తా చాటుతామని నేతలు తెలిపారు.

భద్రాచలానికి పాదయాత్రగా వచ్చిన 7వేల మంది భక్తులు

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రేపు జరగనున్న సీతారాముల కళ్యాణానికి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 7 వేల మంది భక్తులు పాదయాత్రగా భద్రాచలం చేరుకున్నారు. ఉగాది నుంచి పాదయాత్ర మొదలుపెట్టి శనివారం భద్రాచలం చేరుకున్నట్లు వారు తెలిపారు. ప్రతీ ఏటా శ్రీరామనవమికి పాదయాత్రగా వస్తామని చెబుతున్నారు.

error: Content is protected !!