News March 20, 2025

భూపాలపల్లి: రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

image

తెలంగాణ 10వ తరగతి పరీక్షలు ఈనెల 21నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దీనికోసం 2,650 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా తేదీల్లో ఉ’9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

Similar News

News October 16, 2025

రేపు గుంతకల్లుకు సినీ తారలు

image

గుంతకల్లు పట్టణానికి రేపు సినీ తారలు రానున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేయడానికి సినీ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేశ్, రితిక నాయక్ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. రితిక నాయక్ ఇటీవల విడుదలైన మిరాయ్ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

News October 16, 2025

బోగస్ ఓట్లపై ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం: HC

image

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై కేటీఆర్, మాగంటి సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎలక్టోరల్స్‌ను రివిజన్ చేస్తోందని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ విచారణను ముగించింది.

News October 16, 2025

ADB: కొత్తవారికే హస్తం పగ్గాలు..?

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు డీసీసీ అధ్యక్ష పదవుల నియామకం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. కొత్త వారికి అవకాశం కల్పించాలని అధిష్ఠానం యోచిస్తుండటంతో, పదవుల్లో కొనసాగుతున్న పాత నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్గ పోరు, ఆశావహుల సంఖ్య పెరగడంతో ఏకాభిప్రాయం కష్టంగా మారింది. ఈ అంశంపై ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటిస్తూ, నేతల నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలను సేకరిస్తున్నారు.