News February 2, 2025
భూపాలపల్లి: రేపు ప్రజావాణి రద్దు

భూపాలపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో సోమవారం నిర్వచించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు.
Similar News
News October 14, 2025
HYD: తెలుగు వర్శిటీ.. ఫిలిం డైరెక్షన్ దరఖాస్తులకు ఆహ్వానం

హైదరాబాద్లోని సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీ నాంపల్లి ప్రాంగణంలో “పీజీ డిప్లమా ఇన్ ఫిలిం డైరెక్షన్” కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణతలైన వారు అర్హులని, ఆసక్తి గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు వర్శిటీ రంగస్థల కళల శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.రాజు 9346461733కు సంప్రదించాలన్నారు.
News October 14, 2025
భారత తొలి IFS అధికారిణి గురించి తెలుసా?

మధ్యతరగతి మహిళ గడప దాటడమే కష్టమైన రోజుల్లో ధైర్యంగా బడికెళ్లి చదువుకున్నారు IFS అధికారిణి ముత్తమ్మ. ‘ఇది మహిళల సర్వీస్ కాదు’ అన్న UPSC ఛైర్మన్ లింగ వివక్షనూ ఎదుర్కొన్నారామె. వివాహిత మహిళల సర్వీసు హక్కు కోసం సుప్రీంలో పోరాడారు. 1949లో తొలి IFS అధికారిణిగా నియమితులై చరిత్ర సృష్టించారు. మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచిన ముత్తమ్మ 2009లో చనిపోయారు. * ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 14, 2025
HYD: జాతీయ సదస్సు.. OU ప్రొ.మాధవి ప్రసంగం

మహారాష్ట్రలోని నాందేడ్ యశ్వంత్ మహావిద్యాలయంలో ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (PM-UShA) భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ మేరకు OUలోని జువాలజీ విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ ఎం.మాధవిని ఆహ్వానించింది. ‘విక్షిత్ భారత్ కోసం ఆరోగ్యం, ఆహారం, స్థిరత్వం భవిష్యత్తును రూపొందించడం’ అనే అంశంపై ప్రొఫెసర్ మాధవి అంతర్దృష్టితో కూడిన ఆకర్షణీయమైన ప్రసంగం ఇచ్చారు.