News March 19, 2025

భూపాలపల్లి: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం: డీఎంహెచ్‌వో

image

లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరమని పరీక్ష చేయించిన వారు, చేసిన వారు, ప్రోత్సహించిన వారు, శిక్షార్హులు అవుతారని డీఎంహెచ్‌వో డా.మధుసూదన్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే 94405 86982 నంబరుకు సమాచారం అందించాలని సూచించారు. వైద్యులు పాల్గొన్నారు.

Similar News

News November 3, 2025

టంగుటూరు: తోపులాటలో అల్లుడి మృతి

image

టంగుటూరు శ్రీనివాసనగర్‌‌కు చెందిన దివ్యకీర్తితో వంశీకి ఆరేళ్ల కిందట వివాహమైంది. వంశీ హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ జాబ్ కావడంతో అక్కడ కాపురం పెట్టారు. ఇటీవల భర్తతో గొడవపడి దివ్య తన ఇద్దరు బిడ్డలతో టంగుటూరులోని పుట్టింటికి వచ్చింది. వంశీ ఆదివారం భార్య ఇంటికి వచ్చి బంధువులతో రాజీకి ప్రయత్నించారు. ఈక్రమంలో తోపులాట జరిగి వంశీ కిందపడి స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని నిర్ధారించారు.

News November 3, 2025

APPLY NOW: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

image

యూనివర్సిటీ ఆఫ్ కాలికట్‌ 4 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్: https://uoc.ac.inను సంప్రదించండి.

News November 3, 2025

SRSP UPDATE: 24 గంటల్లో 56,514 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 56,514 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు సోమవారం ఉదయం తెలిపారు. 16 స్పిల్ వే గేట్ల ద్వారా 47,060 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.501 TMCలకు గాను తాజాగా పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.