News December 14, 2024
భూపాలపల్లి: విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత: మంత్రి

ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. శనివారం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులతో కలిసి శంకుస్థాపన చేశారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించమని హెచ్చరించారు.
Similar News
News November 17, 2025
వరంగల్: ప్రజావాణిలో 124 వినతుల స్వీకరణ

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్య రాణి హాజరై ప్రజలు ఇచ్చిన వినతులను స్వయంగా స్వీకరించారు. ఈరోజు నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 124 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో అధిక శాతం రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ సమస్యలకు సంబంధించినవని అధికారులు పేర్కొన్నారు.

News November 16, 2025
WGL: ప్రత్యేక లోక్ అదాలత్లో 5,025 కేసుల పరిష్కారం: సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. ఈ అదాలత్ ద్వారా 5,025 కేసులను పరిష్కరించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.89 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.