News January 29, 2025
భూపాలపల్లి: వీఆర్ఏ వారసుల సమస్యలు పరిష్కరించాలి: హరీశ్

వీఆర్ఏ వారసుల సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏ వారసుల సంఘం రాష్ట్ర నాయకుడు, భూపాలపల్లి జిల్లా జేఏసీ ఛైర్మన్ చేన్నపురి హరీశ్ ప్రభుత్వాన్ని కోరారు. కాకతీయ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఈరోజు ఆయన పత్రికా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా 20,555 వీఆర్ఏ వారసులం ఉన్నామన్నారు. న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకోవాలని తెలిపారు.
Similar News
News October 23, 2025
శివలింగం నుంచి నీరు..

తాడిపత్రిలోని పెన్నానది ఒడ్డున వెలసిన బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ఏడాదిలో 365రోజులూ శివలింగం కింద నుంచి జలధార ఊరుతూనే ఉండటం ఇక్కడి మహిమ. బుగ్గ అంటే నీటి ఊట. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అందుకే బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంగా పేరు వచ్చిందని చెబుతారు.
News October 23, 2025
ఖమ్మం: పంచారామాలకు ప్రత్యేక డీలక్స్ బస్సు

కార్తీక మాసం సందర్భంగా ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి పంచారామాలకు ప్రత్యేక డీలక్స్ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. ఈనెల 26న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1040గా నిర్ణయించారు. వివరాలకు 91364 46666ను సంప్రదించవచ్చు.
News October 23, 2025
జనగామ: మద్యం టెండర్లు.. 1,600 దరఖాస్తులు!

మద్యం టెండర్ల గడువు నేటితో ముగియనుంది. ఈనెల 18 వరకు ఉన్న గడువును ఎక్సైజ్ శాఖ ఈనెల 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఐదు రోజుల గడువు పొడిగింపుతో మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. జనగామ జిల్లాలో ఇప్పటివరకు 1600కు పైగా దరఖాస్తులు వచ్చాయని విశ్వసనీయ సమాచారం. ఇంకెవరైనా టెండర్లకు దరఖాస్తు చేసుకోవాలని ఉంటే ఈరోజు ఒక్క మాత్రమే అవకాశం ఉంది.