News March 24, 2025
భూపాలపల్లి: వీణవంకలో 16టన్నుల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నుంచి కరీంనగర్ జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న 16టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున వీణవంక వద్ద పట్టుకున్నారు. లారీని అనుమానంతో ఆపి తనిఖీ చేయగా, రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసిన పోలీసులు, దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Similar News
News March 29, 2025
VZM: గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు గడువు పెంపు

గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాల కోసం ప్రభుత్వం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు గురుకుల జిల్లా కన్వీనర్ కె.రఘునాధ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోగా గురుకుల పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఏప్రిల్ 6 లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 29, 2025
బుమ్రా ఎప్పుడొస్తారో చెప్పలేం: జయవర్ధనే

పేసర్ జస్ప్రీత్ బుమ్రా బాగా కోలుకున్నారని ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే తెలిపారు. అయితే ఎంట్రీ ఎప్పుడన్నది చెప్పలేమని తెలిపారు. ‘బుమ్రాను ఫలానా మ్యాచ్లోపు తీసుకురావాలన్నదేమీ మేం పెట్టుకోలేదు. తన రోజూవారీ వర్కవుట్స్ను క్రమం తప్పకుండా ఏ సమస్యా లేకుండా పూర్తి చేస్తున్నాడు. ఎప్పటి నుంచి ఆడొచ్చనదానిపై NCA ఏ క్లారిటీ ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. BGT సమయంలో బుమ్రాకు వెన్నెముక గాయమైంది.
News March 29, 2025
రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉగాది వేడుకలు

ఉగాది ఉత్సవాలను ఆదివారం ఉదయం గం.10.30ల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఎపీహెచ్ఆర్డీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.