News April 15, 2025
భూపాలపల్లి: వేసవి సెలవులు.. ఓ కన్నేసి ఉంచండి!

ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లితండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూర ప్రాంతాలకు పంపవద్దని, బైకులు ఇవ్వొద్దని, ఫోన్ వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, BHPL జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.
Similar News
News January 3, 2026
ASF జిల్లా సర్పంచులకు శిక్షణ

ఆసిఫాబాద్ జిల్లాలోని సర్పంచులకు 2026 సంవత్సరానికి సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 6 నుంచి 12వ తేదీ వరకు యోగా, కళా మేళా, మానసిక శిక్షణ, పర్యటన, లక్ష్యసాధన, సేవా భావం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సర్పంచులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
News January 3, 2026
HYD: మూడు చోట్లా కాంగ్రెస్ జెండా ఎగరాలనేదే ప్లాన్

HYD, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాంతాల్లో జెండా ఎగురవేయాలని గాంధీభవన్ వర్గాలు నేతలకు దిశానిర్దేశం చేశాయి. జూబ్లీహిల్స్ గెలుపు స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలను వివరించాలని అధిష్ఠానం సూచించింది. అధిక స్థానాల్లో కార్పొరేటర్లను గెలిపించి, నగర రాజకీయాలపై పట్టు సాధించేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
News January 3, 2026
కాళేశ్వరంపై మోజు.. పాలమూరుపై నిర్లక్ష్యం: ఉత్తమ్

TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, కావాలనే పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 121 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. కానీ సోర్స్‌ను జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చడం వల్ల కేవలం 68 టీఎంసీలే తీసుకునేలా చేశారు. దీని వల్ల అంచనా వ్యయం రూ.85వేల కోట్లకు చేరింది’ అని తెలిపారు.


