News April 15, 2025
భూపాలపల్లి: వేసవి సెలవులు.. ఓ కన్నేసి ఉంచండి!

ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లితండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూర ప్రాంతాలకు పంపవద్దని, బైకులు ఇవ్వొద్దని, ఫోన్ వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, BHPL జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.
Similar News
News April 21, 2025
చిన్నగంజాంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం రాజు బంగారు పాలెం గ్రామ పరిధిలోని రైల్వే గేటు పక్కన ఉన్న పొలాలలోని పూరి గుడిసెలో ఉరి వేసుకుని ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సోమవారం స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్సై రమేష్ మాట్లాడుతూ.. మృతుడికి సుమారు 30 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 21, 2025
జంబ్లింగ్ విధానంలో ఏయూ డిగ్రీ పరీక్షల నిర్వహణ

ఏయూ పరిధిలో డిగ్రీ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు తెలిపారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో 180 కాలేజీల విద్యార్థులకు జంబ్లింగ్ విధానంలో 91 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండో సెమిస్టర్ విద్యార్థులకు ఉ.9 నుంచి 12 వరకు, నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
News April 21, 2025
వడ్డీతో సహా చెల్లిస్తాం: మేకపాటి

కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతోందని వైసీపీ ఉదయగిరి ఇన్‌ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.