News February 4, 2025
భూపాలపల్లి: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

2024- 25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ను ప్రవేశపెడుతూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి జనవరి వరకు 53.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఫిబ్రవరి, మార్చిలో మిగతా 18.27 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ అందించనున్నారు.
Similar News
News November 28, 2025
మహిళల్లో ఊబకాయంతో పక్షవాతం ముప్పు

టీనేజ్ నుంచి అధికబరువుతో బాధపడుతున్న మహిళలకు 55 ఏళ్లలోపు పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతున్నట్లు అమెరిన్ స్ట్రోక్ అసోసియేషన్ పరిశోధనలో వెల్లడైంది. చిన్న వయసు నుంచి పెద్దయ్యే దాకా ఊబకాయం లేనివారితో పోలిస్తే.. ఏదో ఒక వయసులో ఊబకాయం ఉన్నవారిలో ముందుగానే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. దీంతోపాటు షుగర్, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని అంటున్నారు.
News November 28, 2025
సత్యసాయి: బాలుడిని చంపింది ఇలా.!

NP కుంటలో హర్షవర్ధన్(4)ను మేనమామ<<18400825>> ప్రసాద్ హత్య చేసిన విషయం <<>>తెలిసిందే. బుధవారం బాలుడిని అంగన్వాడీ నుంచి ఇంటికి పిలిపించుకుని బైక్పై తోటలోని బావ వద్దకు తీసుకెళ్లి పలకరించి ఇంచికి వచ్చాడు. చెల్లెలు చంద్రకళ, మేనకోడలితో మాట్లాడి బాలుడికి రూ.20 ఇచ్చి అంగడికి పంపాడు. తర్వాత వెళ్తున్నానని చెల్లితో చెప్పి ఆడుకుంటున్న బాబును బైక్పై ఎక్కించుకుని గౌకనపేట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపాడు.
News November 28, 2025
గ్రీన్కార్డ్ ఇంటర్వ్యూకు వెళ్తే అరెస్ట్ చేస్తున్న పోలీసులు

గ్రీన్కార్డు ఇంటర్వ్యూలకు వెళ్లిన విదేశీ పౌరులను అరెస్టు చేస్తున్నారు. శాన్ డియాగోలో వీసా ఇంటర్వ్యూకు వెళ్లిన తన క్లయింట్స్ ఐదుగురిని అరెస్టు చేసినట్టు ఓ లాయర్ చెప్పారు. అరెస్టైన వారంతా US సిటిజన్ల జీవితభాగస్వాములని, వీసా గడువు ముగిసినా ఎటువంటి క్రిమినల్ కేసులు వారిపై లేవన్నారు. ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో వీసా గడువు ముగిసిన వారిని అరెస్ట్ చేస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అటార్నీ నస్సేరీ తెలిపారు.


