News February 4, 2025
భూపాలపల్లి: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

2024- 25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్‌ను ప్రవేశపెడుతూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి జనవరి వరకు 53.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఫిబ్రవరి, మార్చిలో మిగతా 18.27 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ అందించనున్నారు.
Similar News
News February 18, 2025
టెక్కలి : ప్రభుత్వ హాస్టళ్లో గర్భం దాల్చిన విద్యార్థిని

టెక్కలిలోని ఓ ప్రభుత్వ బాలికల వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థినికి టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి వైద్య పరీక్షలు నిర్వహించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని గర్భం దాల్చిందనే ప్రచారం సోమవారం నాటికి బయటకు పొక్కడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News February 18, 2025
MBNR: ఐదుగురు డిప్యూటీ తహశీల్దారులు బదిలీ!

జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు డిప్యూటీ తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ విజయేంద్రి బోయి బదిలీ చేశారు. జడ్చర్ల డీటీగా పనిచేస్తున్న రాజీవ్ రెడ్డి ని కలెక్టరేట్లోని డీఎస్ఓ డీటీగా నియమించగా, డీఎస్ఓ లో డీటీలుగా పనిచేస్తున్న శ్యాంసుందర్ రెడ్డిని మహబూబ్నగర్ రూరల్ డీటీగా, ఈయనతో పాటు కిషోర్ ని జడ్చర్ల డీటీగా, నావాబ్ పేట డీటీ గాయత్రిని మహబూబ్నగర్ డీటీగా, రూరల్ డీటీ సువర్ణను నవాబ్ పేట్ డీటిగా నియమించారు.
News February 18, 2025
పార్టీ ఫిరాయింపుల కేసు.. నేడు సుప్రీంలో విచారణ

TG: తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన 10మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గత నెల 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారించనుంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌పై స్పెషల్ లీవ్ పిటిషన్, మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ దాఖలు చేసింది.