News April 11, 2025
భూపాలపల్లి: సెల్ ఫోన్ సిగ్నల్ రావాలంటే చెట్లు ఎక్కాల్సిందే!

మహాముత్తారం మం.లోని యత్నారంలో సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్ రావాలంటే ఎత్తైన ప్రదేశం లేదా చెట్లైనా ఎక్కాలి. లేదా ట్రాక్టర్ ట్రాలీపై నిల్చొని మాట్లాడాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో సెల్ టవర్ నిర్మించాలని, లేదా సమీప టవర్ సిగ్నల్ పరిధినైనా పెంచాలని కోరుతున్నారు. మీ ప్రాంతంలో సిగ్నల్ ఎలాఉందో కామెంట్ చేయండి.
Similar News
News October 26, 2025
NRPT: పోలీస్ అమరవీరుల ఘన నివాళి

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పోలీసులు, ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక వీర సావర్కర్ కూడలి నుంచి నర్సిరెడ్డి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళి అర్పించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల సేవలు గొప్పవని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ప్రజలు పాల్గొన్నారు.
News October 26, 2025
అపోహలు నమ్మొద్దు: కలెక్టర్

మొంథా తుపాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ సూచించారు. ప్రజలు పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తప్పుడు సమాచారాన్ని నమ్మకూడదని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లవద్దని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దన్నారు. అవసరమైతే కంట్రోల్ రూమ్కి సమాచారం అందించాలని సూచించారు.
News October 26, 2025
వనపర్తిలో పోలీసుల సైకిల్ ర్యాలీ

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఉంటుందని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు. సైకిల్ ర్యాలీని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గిరిధర్ ప్రారంభించి పోలీస్ అధికారులతో కలిసి సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొంటారని అన్నారు. ఈ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు సాగుతుందన్నారు.


