News February 25, 2025
భూపాలపల్లి: 8న జాతీయ లోక్ అదాలత్

మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్‌లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని, సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే కలిగే లాభాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.
Similar News
News March 24, 2025
MBNR: సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నాను: మాజీ ఎంపీ

10,950 జీపీవో పోస్టులను నియమించినందుకు, వీఆర్వో, వీఆర్ఎల్‌ను కూడా క్రమబద్ధీకరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. అలాగే కోచ్‌ల పోస్టులను క్రమబద్ధీకరించడం, కొత్త కోచ్‌ల నియామకం కూడా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి వేస్తారని ఆశిస్తున్నానన్నారు.
News March 24, 2025
HYD MMTSలో యువతిపై అత్యాచారయత్నం

సికింద్రాబాద్ TO మేడ్చల్ MMTSలో ఓ యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించగా.. కదులుతున్న ట్రెయిన్‌లో నుంచి ఆ యువతి దూకేసింది. తీవ్రగాయాలైన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 24, 2025
ఎర్రగుంట్ల: మోసాల్లో ఇదో కొత్త రకం

బంధువని చెప్పి మాటల్లో పెట్టి మోసంచేసే కేటుగాడిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేటకు చెందిన ఖాసీంపీరా చెడు వ్యసనాలకు బానిసై అప్పులుచేసి, అవి తీర్చడానికి అడ్డదారులు ఎంచుకున్నాడు. ఈనెల 9న ఎర్రగుంట్లలో మహబూబీ అనే వృద్ధురాలిని బంధువని నమ్మించాడు. ‘తన కూతురి పెళ్లికి రావాలని, మీ చేతికి ఉన్న ఉంగరం లాంటిది చేయిస్తానని చెప్పి, ఇవ్వాలని తీసుకొని’ ఉడాయించాడు.