News March 16, 2025

భూపాలపల్లి: MLHPలు, ప్రోగ్రాం అధికారులతో రివ్యూ మీటింగ్

image

భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయంలో శనివారం DMHO మధుసూదన్ MLHPలు, ప్రోగ్రాం అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ యొక్క ఆక్టివిటీస్ ఓపీ, సర్వీస్ డెలివరీ, ఆరోగ్య శివిర్, ఆబహ,ఈ సంజీవిని, మెడిసిన్ అవైలబిలిటీ, హెల్త్ డేస్ యాక్టివిటీస్ తదితర అంశాలపై చర్చించారు. టార్గెట్స్, అచీవ్మెంట్స్ చూసుకొని పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆయన ఆదేశించారు.

Similar News

News November 28, 2025

ADB: బార్డర్లపై ఫోకస్ పెడితే బెటర్..!

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారులంతా మహారాష్ట్ర బార్డర్లపై దృష్టిసారించాల్సిన అవసరముంది. ఎందుకంటే అక్కడి నుంచే అక్రమ మద్యం ADBలోకి తీసుకొచ్చే ఆస్కారముంది. అక్కడ అక్కడ తక్కువ ధరకు దొరికే దేశీదారును అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంచే అవకాశముంది. తలమడుగు, తాంసి, బేల, భీంపూర్, భైంసా, కుబీర్, జైనథ్, చింతలమానేపల్లి ఇలా సరిహద్దు మండలాల్లో చెక్‌పోస్టులు, తనిఖీలు పెంచాలి.

News November 28, 2025

టాక్సిక్ వర్క్ కల్చర్‌లో పనిచేస్తున్నా:గర్భిణి ఆవేదన

image

ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా కొందరు మేనేజర్లు ఇబ్బందిపెడుతుంటారు. అలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్‌లో ఇబ్బందిపడుతున్న 28 వారాల గర్భంతో ఉన్న బ్యాంక్ ఉద్యోగిని చేసిన రెడిట్ పోస్ట్ వైరలవుతోంది. అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యానని,103°F జ్వరంలోనూ మేనేజర్ సెలవు నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లీవ్ అడిగితే ఫోన్ చేసి తిట్టారని ఆమె ఆరోపించారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది.

News November 28, 2025

అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

image

AP: రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రికి సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతికి మరింత ఆర్థిక సాయం అందించాలని కోరారు.