News March 18, 2025
భూపాలపల్లి: WOW.. అరుణ వర్ణపు కాంతితో నిండు చంద్రుడు!

అరుణ వర్ణపు కాంతితో నిండు చంద్రుడు దర్శనమిచ్చాడు. మనసు ఉల్లాసపరిచేలా, చూపరులను ఆకట్టుకునేలా మురిపింపజేస్తున్న ఎరుపు వర్ణపు చంద్రుడు దృశ్యం సోమవారం రాత్రి కనిపించింది. కళ్లను కట్టిపడేసేలా ఉన్న నిండు చంద్రుడిని చిట్యాల మండలం కైలాపూర్ గ్రామం వద్ద సెల్ఫోన్ కెమెరాలో బంధించారు. అరుదుగా జరిగే సన్నివేశాల్లో అరుణ వర్ణపు చంద్రుడు కనిపించడం ఒకటని స్థానికులు భావిస్తున్నారు.
Similar News
News December 5, 2025
హోంలోన్లు తీసుకునేవారికి గుడ్న్యూస్

RBI <<18475069>>నిర్ణయంతో<<>> హోంలోన్లపై వడ్డీరేటు కనిష్ఠ స్థాయికి చేరుకోనుంది. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీరేటు 7.35శాతంతో మొదలవుతోంది. ఇకపై ఇది 7.1శాతానికి పడిపోనుంది. గృహరుణాలు తీసుకోవడానికి ఇదే మంచి తరుణమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. మీరూ హోం లోన్ తీసుకుంటున్నారా?
News December 5, 2025
హిమాచల్ప్రదేశ్ సీఎంని ఆహ్వానించిన మంత్రి అడ్లూరి

ఈనెల8,9 తేదీలలో జరగనున్న తెలంగాణ రెజ్లింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుకిందర్ సింగ్ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు. శుక్రవారం మంత్రి స్వయంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లి సీఎంని ఆహ్వానించారు. అనంతరం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ఇరువురు ముచ్చటించుకున్నారు. సీఎం స్పందించి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు.
News December 5, 2025
ములుగు: నేర చరిత్రను దాచిన సర్పంచ్ అభ్యర్థి..!

సర్పంచ్ ఎన్నికలు వివాదాల వైపుకు దారి తీస్తున్నాయి. వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి పంచాయతీలో సర్పంచ్గా పోటీలో ఉన్న ఓ వ్యక్తి తన నేరచరిత్రను దాచి పెట్టి ఎన్నికల కమిషన్ కు తప్పుడు అఫిడవిట్ ఇచ్చాడని ఆధారాలతో సహా మరో అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరపాలని జిల్లా అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.


