News April 17, 2025
భూభారతిపై మేడ్చల్ కలెక్టర్ సమావేశం

ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతం అన్నారు. కలెక్టరేట్‌లో భూభారతిపై తహాశీల్దార్లు, జిల్లా రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించేందుకు అదనపు కలెక్టరు విజయేంధర్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు.
Similar News
News April 20, 2025
సిద్దిపేట: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 20, 2025
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండాయి. నిన్న 78,821 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 33,568 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చింది.
News April 20, 2025
వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.