News April 16, 2025
భూభారతి చట్టంపై అవగాహన కల్పించండి: వనపర్తి కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 17 నుంచి మండలాల వారీగా రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి చట్టంపై అవగాహన, అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు.
Similar News
News February 22, 2026
వికారాబాద్: బంపర్ ఆఫర్.. రూ.30 వేలకే స్కూటర్

ప్రభుత్వం మైనారిటీ యువతకు ఈ స్కూటర్ పథకం ప్రారంభించింది. స్కూటర్ ధర రూ.1.50 లక్షలు. అందులో రూ.1.20 లక్షలు సబ్సిడీగా ఇస్తుంది. లబ్ధిదారుడు రూ.30,000 మాత్రమే చెల్లించాలి. వయస్సు 21–40 సంవత్సరాలు ఉండాలి. 10వ తరగతి పాస్, డ్రైవింగ్ లైసెన్స్, PAN కార్డు తప్పనిసరి. దరఖాస్తులు 01-03-2026 వరకు tsobmms.cgg.gov.inలో అప్లై చేసుకోవాలని జిల్లా అధికారి ఎస్.రాజేశ్వరి తెలిపారు.
SHARE IT
News February 22, 2026
VZM: పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

పెళ్లి ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం (D) సంతకవిటి (M) పోతురాజుపేటకి చెందిన ఐ.దివ్య (22)కి మార్చి 7న వివాహం నిశ్చయించారు. అయితే యువతి ఈనెల 20న గడ్డిమందు తాగింది. వెంటనే రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం శ్రీకాకుళం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 21న మృతి చెందింది. పెళ్లి ఇష్టం లేకనే దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
News February 22, 2026
జగిత్యాల: యథాతథంగా ‘ప్రజావాణి’ కార్యక్రమం

జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం యథాతథంగా ప్రజావాణి నిర్వహిస్తామని వెల్లడించారు. సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను నేరుగా స్వీకరిస్తామని చెప్పారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.


