News October 28, 2024

భూమనకు అన్ని ఆస్తులు ఎక్కడివి..?: పట్టాభిరామ్

image

తాడేపల్లి ప్యాలెస్‌కు ఊడిగం చేసే దొంగల ముఠాలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన ఒకరని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. ‘తిరుపతి దొడ్డాపురం వీధిలోని ఓ చిన్న ఇంట్లో భూమన రెంట్‌కు ఉండేవారు. మొదట్లో ఆర్టీసీ బస్టాండ్ వద్ద జిరాక్స్ షాపులో పనిచేశారు. అలాంటి ఆయనకు ఇన్ని వేల రూ.కోట్లు ఎలా వచ్చాయి? శ్రీవారి సొమ్ము కాజేశారు. టీడీఆర్ బాండ్ల దోపిడీలో సంపాదించిన సొత్తే అది’ అని ఆరోపించారు.

Similar News

News November 4, 2025

చిత్తూరు: దరఖాస్తులతో రూ.10 లక్షల ఆదాయం

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని 56 పోస్టులకు గత నెల నోటిఫికేషన్ ఇచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 2,093 దరఖాస్తులు వచ్చినట్లు చిత్తూరు DMHO సుధారాణి తెలిపారు. దరఖాస్తుల ఫీజుతో తమ శాఖకు రూ.10.46 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.

News November 4, 2025

చిత్తూరు విద్యార్థులకు అరుదైన అవకాశం

image

చిత్తూరులోని ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు N.లాస్య, M.రమాకాంత్‌కు అరుదైన అవకాశం దక్కింది. వీరిద్దరూ సైన్స్‌లో ప్రతిభ చూపడంతో “సైన్స్ ఎక్స్‌పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్”‌కు సెలెక్ట్ చేశారు. ఇందులో భాగంగా నవంబర్ 6 నుంచి ఢిల్లీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి వివిధ కార్యాలయాలను చూపిస్తారు. పరిశోధనాసక్తి, దేశభక్తి పెంపొందించేలా టూర్ ఉంటుందని డీఈవో వరలక్ష్మి తెలిపారు.

News November 4, 2025

పుంగనూరులో విషాదం

image

గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతిచెందిన ఘటన పుంగనూరులో జరిగింది. పురుషోత్తం శెట్టి(75), రాధాకృష్ణయ్య శెట్టి(67) సోదరులు. పురుషోత్తం శెట్టికి పిల్లలు లేరు. వీరు ఉమ్మడిగా ఉంటూ బజారు వీధిలో కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. నిన్న రాధాకృష్ణయ్య బాత్ రూములో జారి పడిపోయారు. సాయం చేయడానికి వెళ్లిన పురుషోత్తంశెట్టికి డోర్ తగిలి గాయపడ్డాడు. రాధాకృష్ణయ్య శెట్టి ఇంట్లో, పురుషోత్తంశెట్టి ఆసుపత్రిలో మృతిచెందాడు.