News February 4, 2025
భూమిలిచ్చిన రైతులకు రూ.20 లక్షలు.. ఉద్యోగం: కలెక్టర్

ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు భూములు ఇచ్చే రైతులు అపోహలు వీడాలని కలెక్టర్ ప్రతిక్ జైన్ సూచించారు. భూములు ఇచ్చేవారికి రూ.20 లక్షల పరిహారం, 150 గజాల ప్లాటు, ఇందిరమ్మ ఇళ్లు, ఆయా కంపెనీల్లో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. నిన్న దుద్యాల మండలం హకీంపేట్ రైతులకు అవగాహన కల్పించారు. 218 మంది రైతులు సమ్మతి పత్రాలు అందజేశారు. కంపెనీల ఏర్పాటుతో పిల్లలకు ఉద్యోగాలు వస్తాని రైతులు అభిప్రాయ పడ్డారు.
Similar News
News December 16, 2025
NTR: బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలను పంపిణీ చేసిన కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చేలా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఏడు బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలను కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కలెక్టరేట్లో పంపిణీ చేశారు. ఇంటింటి నుంచి తడి-పొడి చెత్తను వేరుగా సేకరించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని తెలిపారు. డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, డీపీవో పి. లావణ్య కుమారి, తదితరులు పాల్గొన్నారు.
News December 16, 2025
KMR: రేపే మూడో విడత ఎన్నికలు..ఓటర్లు ఎంతమందంటే

బాన్సువాడ డివిజన్ పరిధిలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, డోంగ్లి, మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడప్గల్, జుక్కల్ మండలాల్లోని 144 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. 2,01,885 ఓటర్లు ఉండగా 98,427 మంది పురుషులు, 1,03,452 మంది మహిళా ఓటర్లు, 6 ఇతరులు ఉన్నారు. 1,482 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే 26 సర్పంచ్, 441 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. మిగతా గ్రామాల్లో రేపు పోలింగ్ జరగనుంది.
News December 16, 2025
వరంగల్: 23 మండలాల్లో చివరి పోలింగ్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 530 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. WGL(D) నర్సంపేట, ఖానాపూర్, చెన్నరావుపేట, HNK(D) ఆత్మకూర్, దామెర, నడికుడ, శాయంపేట, జనగామ(D) దేవరుప్పుల, పాలకుర్తి, కొడకొండ్ల, BHPL(D) మల్హర్రావు, మహదేవ్పూర్, మహాముత్తారం, కాటారం, ములుగు(D) వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్ మండలాల్లోని 530 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.


