News February 26, 2025

భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోండి 

image

రాష్ట్రంలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో ఇళ్లు నిర్మించుకున్నవారు క్రమబద్దీకరణ చేసుకోవడానికి ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ ఒక ప్రకటనలో కోరారు. మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.

Similar News

News March 19, 2025

నాదెండ్లతో నెల్లూరు నేతల భేటీ

image

మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోని మంత్రి ఛాంబర్‌లో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. మంత్రులు ఆనం, నారాయణ, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి, సోమిరెడ్డి తదితరులు ఉన్నారు.

News March 18, 2025

ఏప్రిల్ మూడో వారంలోగా రీ సర్వే పూర్తి: నెల్లూరు జేసీ

image

జిల్లాలో ఎంపిక చేసిన 35 గ్రామాలలో ఏప్రిల్ మూడో వారంలోగా రీసర్వే పూర్తి చేస్తామని జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. మండలంలోని పిడూరు గ్రామంలో జరుగుతున్న రీ సర్వేని ఆయన మంగళవారం పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందజేశారు. నోషనల్ ఖాతాలు లేకుండా చూడాలన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 35 గ్రామాలను రీ సర్వే చేయడానికి పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేశామన్నారు.

News March 18, 2025

వరికుంటపాడు: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌తో అనుచిత ప్రవర్తన

image

వరికుంటపాడు మండలంలోని ఓ గ్రామంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో BPM గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. పోస్ట్ ఆఫీస్‌లో ఖాతాకు సంబంధించిన మొత్తంలో తేడా ఉందని అతడు అనుచితంగా ప్రవర్తించి మొబైల్ ఫోన్ ధ్వంసం చేసినట్లు సమాచారం. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!