News February 4, 2025

భూముల క్రమబద్ధీకరణకు అవకాశం: విశాఖ జేసీ 

image

విశాఖలో అర్బన్ పరిధిలో మిగుల భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు జేసీ అశోక్ తెలిపారు. 1.5.2019కి ముందు నుంచి భూమి ఆక్రమణలో ఉన్నట్టుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, GVMC అప్రూవల్ ప్లాన్, ఇంటి పన్ను రసీదు, కరెంటు బిల్ రసీదులతో సంబందిత తహశీల్దార్ కార్యాలయంలో డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Similar News

News February 10, 2025

విశాఖలో పోలీస్ అధికారులతో సమీక్ష చేసిన డీజీపీ

image

విశాఖలో పోలీసుల పనితీరు చాలా బాగుందని క్రైమ్ రేట్ పెరగకూడదని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమస్యలు విని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్‌తో పాటు డీసీపీలు పాల్గొన్నారు.

News February 9, 2025

విశాఖ: సముద్రంలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

image

విశాఖకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్ర తీరంలో ఆదివారం మృతిచెందారు. మృతులు కంచరపాలేనికి చెందిన మొక్క సూర్యతేజ, దువ్వాడకు చెందిన మొక్క పవన్‌గా గుర్తించారు. రాంబిల్లి బీచ్‌లో స్నానం చేయడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అలల తాకిడికి సముద్రంలో మునిగి చనిపోయినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 9, 2025

విశాఖ: మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియకు బ్రేక్

image

విశాఖ జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 14 మద్యం షాపులు లాటరీ పద్ధతికి బ్రేక్ పడింది. సోమవారం లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత తేదీని ఖరారు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

error: Content is protected !!