News March 28, 2025
భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోండి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో భూముల క్రమబద్దీకరణకు మీసేవ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలిసి ఆయన మాట్లాడుతూ.. జీవో నంబర్ 30ని అనుసరించి 2025 పేరిట భూమి క్రమబద్ధీకరణ చేపడతామన్నారు. డిసెంబర్ 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.
Similar News
News April 5, 2025
బాపట్ల: పోలీస్ శాఖలో నిఘా విభాగం విధులు కీలకం- ఎస్పీ

పోలీస్ శాఖలో నిఘా విభాగం విధులు కీలకమని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. శనివారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా నిఘా విభాగ పోలీస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ముందస్తు సమాచారాన్ని వేగవంతంగా సేకరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు నేరాలు కట్టడం చేయటానికి ముందస్తు సమాచారం కీలకమన్నారు.
News April 5, 2025
అంటరానితనం నిర్మూలనకు జగ్జీవన్ రామ్ కృషి: కలెక్టర్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్సు స్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంటరానితనమన్నదే ఉండకూడదని, అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణు మాధవ్ ఉన్నారు.
News April 5, 2025
శ్రీరామ నవమి వేడుకకు అయోధ్య సిద్ధం

శ్రీ రామ నవమి వేడుకకు అయోధ్య రామ మందిరం ముస్తాబైంది. ఎండల నేపథ్యంలో ప్రత్యేక వసతి కేంద్రాలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలలో వాహనాలను పంపిస్తున్నారు. శ్రీరామ నవమి వేడుకలను భక్తులందరూ తిలకించేలా భారీ LED స్ర్కీన్లు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.