News February 2, 2025
భూముల రీసర్వే సందేహాలకు ఎక్స్‌పర్ట్ సెల్: JC

భూముల రీసర్వేకు సంబంధించి భూముల యజమానులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు ఎక్స్‌పర్ట్ సెల్‌ను ఏర్పాటు చేసినట్టు జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ శనివారం తెలిపారు. ఎక్స్‌పర్ట్ సెల్ అధికారిగా సర్వే భూరికార్డుల శాఖకు చెందిన ఏ.మన్మధరావును నియమించినట్లు పేర్కొన్నారు. ఆయన కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు.
Similar News
News February 18, 2025
జిల్లాలో హోటల్స్‌కు ప్రభుత్వం రేటింగ్: కలెక్టర్

పర్యావరణ హితంగా, పర్యాటకులను ఆకర్షించేలా నడిపే హోటళ్లకు ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తుందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో హోటల్ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చే ఈ రేటింగ్‌ను హోటల్స్ ఆన్‌లైన్ లో అప్లోడ్ చేసుకోవచ్చునని, అందువలన ఆయా హోటల్స్‌కు ర్యాంకింగ్ బుక్ చేసుకునే వారికీ తెలుస్తుందని పేర్కొన్నారు.
News February 17, 2025
VZM: మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ

మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని విజయనగరం ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో రామతీర్థాలకు 45 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా ఎస్.కోట డిపో నుంచి పుణ్యగిరికి 35 బస్సులు, ఎస్.కోట నుంచి సన్యాసిపాలెంకు 10 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
News February 17, 2025
విజయనగరం: ఆమె జీబీఎస్‌తో చనిపోలేదు..!

విశాఖ KGHలో ఓ వృద్ధురాలు గుండెపోటుతో చనిపోయిందని సూపరింటెండెంట్ శివానంద్ చెప్పారు. ‘విజయనగరం(D) L.కోట మండలానికి చెందిన వృద్ధురాలు(63) గుయిలెయిన్-బారే సిండ్రోమ్(జీబీఎస్) అనుమానాస్పద లక్షణాలతో ఫిబ్రవరి 6న KGHలో చేరారు. ఆమెకు షుగర్, బీపీ ఉన్నాయి. మేం అందజేసిన చికిత్సతో కాస్త కోలుకున్నారు. ఇవాళ ఛాతీ నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో చనిపోయినట్లు తేలింది. ఆమె GBSతో చనిపోలేదు’అని ఆయన తెలిపారు.