News April 15, 2025
భూసమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: నారాయణ

అమరావతిలో మరోసారి భూసమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మంగవారం మంత్రి నారాయణ 5వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు నిర్నయించారని, దానికోసం భూమి అవసరం ఉందన్నారు. అయితే ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారనే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు మంత్రి అన్నారు.
Similar News
News October 23, 2025
చొప్పదండి పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు

చొప్పదండి పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఈ నిధులు మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు చొప్పదండి పట్టణ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో చొప్పదండి మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News October 23, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓కొత్తగూడెం: రామవరంలో కార్డెన్ సెర్చ్
✓జిల్లా వ్యాప్తంగా రోడ్లకు మరమ్మతులు చేయాలి: కలెక్టర్
✓జిల్లావ్యాప్తంగా కొమరం భీమ్ జయంతి వేడుక
✓పినపాక: రెండు బైక్ లు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
✓BASలో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
✓డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టండి: ఇల్లందు డీఎస్పీ
✓ఈనెల 24న పాల్వంచ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
✓మణుగూరు: సురక్ష బస్టాండ్లో పోలీసుల తనిఖీలు
✓రోడ్లు బాగు చేయాలని BRSనిరసనలు
News October 23, 2025
PDPL: పత్తి రైతులకు కొత్త చిక్కులు.. స్లాట్ బుకింగ్ తప్పనిసరి

పత్తి పంట విక్రయించే రైతులకు సిసిఐ కొత్త నియమాలు తీసుకొచ్చింది. రైతులు తమ పత్తిని విక్రయించాలంటే వారం రోజుల ముందుగానే యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి. బుకింగ్ చేసిన తేదీ, సమయానికే కొనుగోలు కేంద్రాలకు రావాలని అధికారులు తెలిపారు. ఎక్కువసేపు క్యూలలో నిలబడి ఇబ్బంది పడకుండా ఉండడమే ఈ విధానం లక్ష్యమని సీసీఐ వెల్లడించింది. కాగా పెద్దపల్లి జిల్లాలో 49 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు.