News June 19, 2024

భూసేకరణపై దృష్టి సారించాలి: అనంతపురం జిల్లా కలెక్టర్

image

జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులు, ఏపీఐఐసీ, సోలార్ ప్రాజెక్టులు, పవర్ గ్రిడ్, ఎంఐజి లేఅవుట్, రైల్వే, సాంఘిక సంక్షేమ శాఖల భవనాలకు సంబంధించి భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. భూ కేటాయింపు ప్రక్రియపై పలు సూచనలు చేశారు.

Similar News

News September 8, 2024

అనంత: తవ్వకాల్లో బయటపడ్డ అయ్యప్ప స్వామి విగ్రహం

image

బెళుగుప్ప మండలంలోని దుద్దెకుంటలో ఆలయం నిర్మాణం కోసం తీసిన తవ్వకాలలో గ్రామానికి చెందిన క్రాంతి అనే యువకుడికి అయ్పప్ప స్వామి విగ్రహం దొరికింది. క్రాంతి మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి తనకు కలలో ఈ విగ్రహం గురించి చెప్పినట్టు తెలిపారన్నాడు. విగ్రహం 500 గ్రాముల బరువు ఉన్నట్లు చెప్పాడు. స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించారు.

News September 8, 2024

అనంతపురంలో యువతి దారుణ హత్య UPDATE

image

ఆత్మకూరు మండలం వడ్డుపల్లి వద్ద హత్యకు గురైన గుమ్మగట్ట మండలం సిరిగే దొడ్డి గ్రామానికి చెందిన మహిళ శిరీషగా పోలీసులు గుర్తించారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతోందని, శనివారం ఇంట్లో చెప్పి వచ్చినట్లు శిరీష కుటుంబ సభ్యులు తెలిపారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.

News September 8, 2024

గుంతకల్లులో సోషల్ మీడియా వినాయకుడు

image

గుంతకల్లు పట్టణంలోని ఆంటోనీ స్ట్రీట్‌లో సోషల్ మీడియా వినాయకుడు కొలువుదీరాడు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉన్నందున అన్ని సోషల్ మీడియా ప్లాట్ ‌ఫామ్‌ల చిహ్నాలతో వినాయకుడిని ప్రత్యేకంగా తయారు చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు. వాట్సాప్, ఫేస్ బుక్, స్నాప్ చాట్ , ఇన్స్టాగ్రామ్, ట్విటర్, లింక్డ్ ఇన్, యూట్యూబ్, తదితర సోషల్ మీడియా గుర్తులతో కలిపి రూపొందించామన్నారు.