News September 2, 2024
భూసేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్
వివిధ జాతీయ రహదారులు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్, AP ట్రాన్స్కో, రైల్వే, APIIC, తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ చిత్తశుద్ధితో చేపట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన చోట గ్రామసభలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News September 10, 2024
13వ తేదీ లోపు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి చేయండి: కలెక్టర్
ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో ఈ నెల 13వ తేదీ లోపు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్లో మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆల్ ఇండియా రేడియోలో ప్రతి గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసే ఏర్పాటు చేయాలన్నారు.
News September 10, 2024
శ్రీ సత్యసాయి జిల్లాను మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ఎంపిక
శ్రీ సత్యసాయి జిల్లాను మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించారని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు, ఇన్-సానిటరీ లెట్రిన్లు లేవని జిల్లా పంచాయతీ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల నుంచి నివేదికలు అందాయన్నారు. దీంతో సత్య సాయి జిల్లాను మ్యాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించారన్నారు.
News September 10, 2024
వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే రూ.10లక్షల విరాళం
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అండగా నిలిచారు. తన వంతు రూ.10 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి అందజేశారు. సీఎం ఎమ్మెల్యే దగ్గుపాటిని అభినందించారు.