News June 14, 2024

భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ గౌతమ్

image

ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు కలెక్టర్ గౌతమ్ జిల్లాలో రైల్వే, జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 30, 2025

ప్లాస్టిక్ వాడితే జరిమానాలు తప్పవు: కమిషనర్

image

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కమీషనర్ అభిషేక్ అగస్త్య కఠిన చర్యలు ప్రారంభించారు. రాబోయే 15 రోజులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి షాప్‌కు ఒక కిలో బయోడీగ్రేడబుల్ కవర్లను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గడువు తర్వాత ప్లాస్టిక్ వాడే సంస్థలపై జరిమానాలు విధిస్తామన్నారు. పర్యావరణహిత క్లాత్ లేదా జూట్ బ్యాగులు వాడాలని విజ్ఞప్తి చేశారు.

News November 30, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో నేటి నుంచి రెండో విడత నామినేషన్లు
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మంలో ఎంపీ రామసహాయం పర్యటన.

News November 30, 2025

నేలకొండపల్లి: యువ రైతు ఆత్మహత్య

image

నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో అప్పుల బాధ భరించలేక యువ కౌలు రైతు గడ్డి మందు తాగాడు. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరు(27) 15 ఎకరాల కౌలు భూమి సాగు చేశాడు. పంట దిగుబడి సరిగా లేకపోవడంతో చేసిన రూ.20లక్షల అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఏడాది వయసున్న కొడుకు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.