News March 8, 2025
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: మంత్రి

ఖమ్మం: మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కూసుమంచి క్యాంప్ ఆఫీస్‌లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అధికారులతో అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు. జిల్లాలో రైతులు వేసిన పంటలో ఒక్క ఎకరం కూడా ఎండి పోవద్దని, పంట పొలాలకు అవసరమైన నీరు ప్రణాళికాబద్ధంగా రైతులకు అందించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 19, 2025
భద్రాద్రి: మైనర్‌పై అత్యాచారం..యువకుడిపై పోక్సో కేసు

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యువకుడి(24)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి ఊరు చివరికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు.
News March 19, 2025
ఖమ్మం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం అత్యధికంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు కామేపల్లి, కారేపల్లిలో 39.7, సత్తుపల్లి 39.5, వైరా 39.3, ముదిగొండ (పమ్మి) 39.3, వేంసూరు, పెనుబల్లి 38.9, నేలకొండపల్లి 38.8, రఘునాథపాలెం 38.7, కొణిజర్ల 38.2, కల్లూరు 37.2, ఖమ్మం అర్బన్ 37.9, ఖమ్మం రూరల్ (పల్లెగూడెం) 37.6, ఏన్కూరు (తిమ్మరావుపేట) 37.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు.
News March 19, 2025
ప్రత్యేక కార్యాచరణతో ఉపాధి పనుల అమలు: కలెక్టర్

ఖమ్మం: రాబోయే 10 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణతో ఉపాధి హామీ పనులను జిల్లాలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో సంప్రదించి ఆసక్తి గల వారి పొలాల్లో ఫామ్ పాండ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.