News December 19, 2024
భూసేకరణ వేగవంతంగా నిర్వహించాలి: తూ.గో కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లాలోని జాతీయ రహదారులు, రైల్వే, విమానయాన సంస్థల ద్వారా చేపడుతున్న పనులకు సంబంధించి భూసేకరణను వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ ప్రశాంతి సూచించారు. ఈ మేరకు ఆమె రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద గురువారం విమానయాన, ఎన్.హెచ్, రైల్వే, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రహదారులు రైల్వేలకు సంబంధించిన 13 ప్రగతి అంశాలపై ఆమె సమీక్షించారు
Similar News
News October 28, 2025
తుఫాన్ చర్యలపై రాజమండ్రి MP ఆరా

తుఫాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆమె అమెరికా వెళ్లారు. తుపాన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
News October 28, 2025
తూ.గో: పునరావాస కేంద్రాలకు 361 కుటుంబాల తరలింపు

తుఫాను నేపథ్యంలో తూ.గో జిల్లా వ్యాప్తంగా 361 కుటుంబాలు, 1193 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. శిబిరాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
News October 28, 2025
తూ.గో జిల్లా స్కూళ్లకు రేపు సెలవు

తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని స్కూళ్లకు బుధవారం కూడా సెలవు ఇచ్చామని డీఈవో కె.వాసుదేవరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా స్టడీ క్లాసులు, అదనపు తరగతుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


