News April 16, 2025

భూసేకరణ వేగవంతం చేయాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్ 

image

జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణ, భూసేకరణ అంశాలపై అధికారులతో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సమీక్షించారు. ఖమ్మం నుంచి దేవరపల్లి 365 బిజి (గ్రీన్ ఫీల్డ్ హైవే) కు రైతులకు ఇవ్వాల్సిన నగదు చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవాలన్నారు.

Similar News

News October 14, 2025

కాజులూరులో అత్యధిక వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటల్లో జిల్లాలో 224.8 mm వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాజులూరు మండలంలో 78.4, అత్యల్పంగా శంఖవరంలో 0.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచార శాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా సగటున వర్షపాతం 10.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లాలోని 21 మండలాల్లో వర్షపాతం నమోదైంది.

News October 14, 2025

1,064 కిలోల గుమ్మడికాయను పండించాడు

image

గుమ్మడికాయలు సాధారణంగా 3-5KGల బరువు ఉంటాయి. ఇంకా జాగ్రత్తగా పెంచితే 10-20KGల వరకు బరువు పెరగొచ్చు. కానీ కాలిఫోర్నియాలోని సాంట రోసాకు చెందిన బ్రాండన్ డ్వాసన్ ప్రత్యేక పద్ధతులతో 1,064 KGల గుమ్మడికాయను పండించారు. కాలిఫోర్నియాలో జరిగిన గుమ్మడికాయల ప్రదర్శన పోటీలో డ్వాసన్ విజేతగా నిలిచి 20 వేల డాలర్లు గెలుచుకున్నారు. ఇంజినీర్ అయిన డ్వాసన్ ఐదేళ్లుగా అతి పెద్ద గుమ్మడికాయలను సాగు చేస్తున్నారు.

News October 14, 2025

BREAKING: HYD: మీర్‌పేట్ మంత్రాల చెరువులో మహిళ మృతదేహం కలకలం

image

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంత్రాల చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని పోలీసులు ఈరోజు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న మిస్సింగ్ కేసులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు.