News July 7, 2024
భూ కజ్జాలు చేస్తే ఉపేక్షించం: మంత్రి సుభాశ్

పామర్రు మండలం కోటిపల్లిలో ఆరాద్రి అంజనీకుమారి అనే వృద్ధురాలి భూమి కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని మంత్రి వాసంశెట్టి సుభాశ్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే వెళ్లి ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించారు. భూమిని ఆక్రమించుకున్నది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంజనీకుమారికి ధైర్యం చెప్పి.. తక్షణమే ఆమెకు న్యాయం జరగాలని పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు.
Similar News
News September 13, 2025
ధవళేశ్వరం విచ్చేసిన సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామానికి ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల విచ్చేశారు. శనివారం గ్రామంలో జరిగిన మెండా సీతారామయ్య పెద్దకర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, పున్నమరాజు వీర్రాజు పాల్గొన్నారు.
News September 13, 2025
హోంగార్డ్స్ డి.ఎస్.పి గా పి. కిరణ్ కుమార్ బాధ్యతలు

తూర్పు గోదావరి జిల్లా డి.ఎస్.పి (హోంగార్డ్స్)గా పి. కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. 1996 బ్యాచ్‌కు చెందిన కిరణ్ కుమార్ సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
News September 13, 2025
తూ.గో: కొత్త కలెక్టర్‌ను కలిసిన ఆర్డీవో

తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్‌గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కలెక్టర్‌గా పనిచేస్తున్న పి. ప్రశాంతి బదిలీపై వెళ్లారు. రాజమండ్రి జిల్లా కలెక్టరేట్లో నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని కొవ్వూరు ఆర్డీవో రాణి సుష్మిత మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేశారు.