News April 10, 2025
భూ క్రమబద్ధీకరణకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి: జేసీ

భూముల క్రమబద్ధీకరణ పథకం -2025 కింద గృహ, నివాస యూనిట్ల అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను దరఖాస్తు చేసుకొని హక్కులు పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ. నిశాంతి గురువారం తెలిపారు. పెద్ద సంఖ్యలో కుటుంబాలు ప్రభుత్వ భూములను అనధికారికంగా ఆక్రమించుకుని నివాస గృహాలు నిర్మించుకున్నారన్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వారు నిత్యం తొలగింపునకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
Similar News
News November 3, 2025
ఇంటర్నేషనల్ మ్యాచే ఆడలేదు.. WC నెగ్గారు

భారత మహిళల <<18182320>>క్రికెట్<<>> చరిత్రలో హెడ్ కోచ్ ‘అమోల్ ముజుందర్’ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. భారత్ WC లిఫ్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ ముంబై బోర్న్ డొమెస్టిక్ స్టార్.. ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచూ ఆడలేదు. టీమ్ ఇండియాకి ప్రాతినిధ్యం వహించాలన్న తన కలను ఈ విధంగా సాకారం చేసుకున్నారు. ‘క్రెడిట్ అంతా మహిళలకే దక్కుతుంది. ఓటములతో మేము కుంగి పోలేదు. ఇవాళ మా లక్ష్యాన్ని సాధించాం’ అని ముజుందర్ తెలిపారు.
News November 3, 2025
జూడో పోటీల్లో అదిలాబాద్ క్రీడాకారుల ప్రతిభ

హనుమకొండ వేదికగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్ 17 ఎస్జీఎఫ్ఐ జూడో పోటీల్లో జిల్లా క్రీడా పాఠశాలకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. ఏకంగా 12 పతకాలతో మెరిశారు. బాలికల విభాగంలో నాగిని ప్రియ, సహస్ర, సింధు, అక్షిత, ప్రణీత, శృతిలు విజేతలుగా నిలవగా, బాలుర విభాగంలో మనోజ్, తరుణ్, హర్షవర్ధన్, లోకేష్, మధు, సంతోష్ అనే క్రీడాకారులు సత్తా చాటారనీ జూడో కోచ్ రాజు తెలిపారు.
News November 3, 2025
సర్పాలు, నాగులు ఒకటి కాదా?

పురాణాల ప్రకారం.. సర్పాలు, నాగులు వేర్వేరని పండితులు చెబుతున్నారు. సర్పాలంటే భూమిపై తిరిగే పాములని, నాగులంటే దైవ స్వరూపాలని అంటున్నారు. ‘సర్పాలు విషపూరితమైనవి. నాగులు విషరహితమైనవి. నాగులు కోరుకున్న రూపాన్ని ధరించగలవు. అలాగే వీటికి ప్రత్యేకంగా ‘నాగ లోకం’ కూడా ఉంది. ఇవి గాలిని పీల్చి జీవిస్తాయి. కానీ సర్పాలు నేల/నీటిలో మాత్రమే ఉంటాయి. ఇవి నేలను అంటిపెట్టుకొని పాకుతాయి’ అని వివరిస్తున్నారు.


