News April 10, 2025

భూ క్రమబద్ధీకరణకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి: జేసీ 

image

భూముల క్రమబద్ధీకరణ పథకం -2025 కింద గృహ, నివాస యూనిట్ల అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను దరఖాస్తు చేసుకొని హక్కులు పొందాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టీ. నిశాంతి గురువారం తెలిపారు. పెద్ద సంఖ్యలో కుటుంబాలు ప్రభుత్వ భూములను అనధికారికంగా ఆక్రమించుకుని నివాస గృహాలు నిర్మించుకున్నారన్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వారు నిత్యం తొలగింపునకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

Similar News

News February 9, 2026

ఖమ్మం: పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్, శిక్షణ పూర్తయ్యాయని, 100 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.

News February 9, 2026

ఎర్రగుంట్ల: కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు

image

ఎర్రగుంట్ల(M) పోట్లదుర్తిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జాకోబ్(60) తన తల్లి సుందరమ్మ(90)పై ఆదివారం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బంధువులు వెంటనే ఆమెను ప్రొద్దుటూరుకు, ఆపై RIMSకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు CI విశ్వనాథరెడ్డి తెలిపారు. జాకోబ్ తన కూతురు లత వద్ద రూ.18 లక్షలు తీసుకున్నాడు. ఈ అప్పును తీర్చమన్నందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు CI చెప్పారు.

News February 9, 2026

సిద్దిపేట: మహాసభ విజయవంతం చేయాలి: BDSF

image

ఫిబ్రవరి 27, 28న సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) 3వ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని BDSF రాష్ట్ర ఉపాధ్యక్షుడు దబ్బెట ఆనంద్ కోరారు. సోమవారం మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అనేక సమస్యలపై మహాసభలో చర్చించి పోరాటానికి తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం బాధాకరమన్నారు.