News August 20, 2024
భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతాం: కలెక్టర్
ఖమ్మం: భూ నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో ఖమ్మం-దేవరపల్లి నేషనల్ హైవే దంసలాపురం భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి, సాధ్యమైనంత వరకు అన్ని విధాల భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 10, 2024
మళ్ళీ పెరిగిన పత్తి ధర….ఎంతంటే!
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000, క్వింటా పత్తి ధర రూ.7,900 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి ధర మాత్రం రూ.100 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
News September 10, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
>వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
> వరదలపై వైరా ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష
>భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
>ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న చర్యలు
>అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
>పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
>సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News September 10, 2024
పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాలని కూనంనేని కామెంట్స్ చేశారు.