News April 4, 2025
భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాల పంపిణీ

హైదరాబాద్ సైబర్ గార్డెన్లో నల్గొండ జిల్లా వీర్లపాలానికి చెందిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరై ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 12, 2025
నల్గొండకు నేషనల్ అవార్డు

జల్ సంజయ్ జన్ భాగిదారీలో రాష్ట్రానికి తొలి ర్యాంకు వచ్చింది. రాష్ట్రంలో నల్గొండతో పాటు ఆదిలాబాద్ మంచిర్యాల జల సంరక్షణలో టాప్లో నిలిచిన విషయం విదితమే. ఈ పథకాన్ని పక్కాగా అమలు పరిచినందుకు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు జిల్లాకు రావడం తొలిసారి. కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవ వల్లే ఇది సాధ్యమైంది. ఈ పురస్కారం కింద రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం లభించనుంది.
News November 12, 2025
NLG: ధాన్యం సేకరణపై కలెక్టర్ మార్గదర్శం

నవంబర్, డిసెంబర్ తొలి వారంలో పెద్దఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున, కొనుగోలు ప్రక్రియలో పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ ఇల్లా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆమె సంబంధిత శాఖల అధికారులు, తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులకు ఈ మేరకు స్పష్టమైన సూచనలు చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు.
News November 12, 2025
NLG: సన్నబియ్యంలో నూకలే అధికం: లబ్ధిదారులు

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా ఉంటున్నాయని జిల్లాలోని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గత 2 నెలల నుంచి పంపిణీ చేస్తున్న బియ్యంలో 20% పైగా నూకలు ఉంటున్నాయని వారు తెలిపారు. జిల్లాలో మొత్తం 4,66,100 రేషన్ కార్డులు ఉండగా, ప్రతినెలా జిల్లా వ్యాప్తంగా 94.04 లక్షల క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. మీకు కూడా ఇదే సమస్య పునరావృతం అవుతుందా? కామెంట్.


