News April 16, 2025

భూ భారతితో భూ సమస్యల పరిష్కారం: ASF కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టంలోని హక్కులు, భూ సమస్యల పరిష్కారంపై ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌తో కలిసి సమావేశం నిర్వహించారు.  భూభారతి నూతన ROR చట్టంలోని అంశాలు, హక్కులపై మండలాల MROలు, DTలు, గిర్దావార్లు, రెవెన్యూ సిబ్బందికి అవగాహన కల్పించారు.

Similar News

News November 19, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 121 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

మందు బాబులు వాహనాలు నడపడం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 121 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 51 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనం సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.

News November 19, 2025

ఆ భయంతోనే ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీకి!

image

లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎక్కడ తమ వివరాలు బయటపెడతారేమోనని మిగతా నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అనేక మంది ఛత్తీస్‌గఢ్ నుంచి APకి వచ్చి తలదాచుకుంటున్నారని సమాచారం. ఎలాంటి భయం లేకుండా లొంగిపోవడానికి రావాలని, తాము రక్షణ కల్పిస్తామని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్పారు. అటు హిడ్మాను పట్టుకుని కాల్చి చంపినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయాడన్నారు.

News November 19, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 5 ఇసుక ట్రాక్టర్లు సీజ్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. రెండు వేర్వేరు ఘటనల్లో 5 కేసులు నమోదు చేసి, ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 15 టన్నుల ఇసుకతో పాటు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వర్ధన్నపేట పరిధిలో నాలుగు, పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైంది.