News April 16, 2025
భూ భారతి, ఇళ్ల పంపిణీపై KMR కలెక్టర్ సమీక్ష

భూ భారతి పై విస్తృత ప్రచారం చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. భూ భారతి అవగాహన సదస్సులు మే 17 నుంచి 30 మధ్య నిర్వహించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలను కమిటీల ద్వారా మే 2న గ్రామ సభలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.
Similar News
News January 10, 2026
నల్గొండ ఖాకీల ‘కోడి’ విందు

పందెం రాయుళ్లపై ఉక్కుపాదం మోపాల్సిన ఖాకీలు.. వారు పట్టుకున్న కోళ్లనే కుమ్మేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నల్గొండ టూ టౌన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ వాళ్లు స్వాధీనం చేసుకున్న పందెంకోళ్లు మాయమవ్వడం సంచలనంగా మారింది. సాక్ష్యాధారాల కింద కోర్టుకు పంపాల్సిన కోళ్లను, కొందరు పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా విందు చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ‘కోడి మాయాజాలం’పై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
News January 10, 2026
కామారెడ్డి: రోడ్డు నిబంధనలు పాటించాలి

వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు వాహన డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. రోడ్డు నిబంధనలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు పలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.
News January 10, 2026
ఇరాన్ విప్లవం గురించి తెలుసా?

ఇరాన్ చివరి రాజు మహ్మద్ రెజా షా పహ్లావి 1941 నుంచి 1979 వరకు పాలించారు. ఆయిల్ నిల్వలను అమెరికా కంపెనీలకు కట్టబెట్టడం, పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోవడంతో మత పెద్దలు, ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. అయతుల్లా రుహొల్లా ఖమేనీ నాయకత్వంలో(1979) ఇస్లామిక్ విప్లవంతో రెజా దేశం విడిచి పారిపోయారు. ఖమేనీ US కంపెనీలను బహిష్కరించారు. మహిళలపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఖమేనీల పాలనపై <<18808619>>వ్యతిరేకత<<>> మొదలైంది.


