News January 10, 2026
‘భూ భారతి’ ఛార్జీల చెల్లింపు అక్రమాలపై విచారణకు ఆదేశం

TG: ‘భూ భారతి’ రిజిస్ట్రేషన్ ఛార్జీల చెల్లింపులో <<18804858>>అక్రమాలపై<<>> లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. సమగ్ర నివేదిక సమర్పించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ&భూ పరిపాలన శాఖ అధికారులకు నిర్దేశించింది. ఈ స్కామ్‌లో యాదగిరిగుట్టకు చెందిన ఓ మీ సేవ నిర్వాహకుడే ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. పోర్టల్‌కు నకిలీ ప్రింటర్ యాప్‌ను జోడించి తప్పుడు రశీదులు సృష్టించినట్లు సమాచారం.
Similar News
News January 20, 2026
మాఘ మాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఎందుకు జరుగుతాయి?

ఇది కల్యాణ కారకమైన మాసం. ఈ నెలలో ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమవుతుంది. ధర్మశాస్త్రాల ప్రకారం.. మాఘంలో పెళ్లి చేసుకున్న దంపతులు అన్యోన్యంగా, అష్టైశ్వర్యాలతో, సంతాన సౌభాగ్యంతో వర్ధిల్లుతారని నమ్మకం. ప్రకృతి పరంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం, పంటలు చేతికి వచ్చి శుభకార్యాలకు అనువైన సమయం కావడం వల్ల కూడా ఈ మాసంలో ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ మాసం వివాహ వేడుకలకు కేంద్రబిందువుగా మారుతుంది.
News January 20, 2026
పవన్ పిలుపుతోనే ఏపీలో షూటింగ్: నవీన్ పొలిశెట్టి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతోనే ‘అనగనగా ఒక రాజు’ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం గోదావరి జిల్లాల్లో జరిగిందని హీరో నవీన్ పొలిశెట్టి తెలిపారు. ఏపీలో మూవీ షూటింగ్స్ జరగాలని ఓ కార్యక్రమంలో పవన్ చేసిన కామెంట్స్ తన హృదయాన్ని తాకాయన్నారు. చిత్రీకరణ ఎక్కడ చేసినా అధికారులు ఈజీగా పర్మిషన్లు ఇచ్చారని, పూర్తి సహకారం అందించారని తెలిపారు. నిన్న రాజమండ్రిలో నవీన్, మీనాక్షీ చౌదరి సందడి చేశారు.
News January 20, 2026
ఆర్సీబీ సరికొత్త చరిత్ర

WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టించింది. టోర్నీలో వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. గత సీజన్‌లో RCB తన చివరి మ్యాచ్‌లో గెలవగా ఈసారి వరుసగా ఐదు విజయాలు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో 2024లో తొలి ట్రోఫీని గెలుచుకున్న స్మృతి సేన మరోసారి టైటిల్‌పై కన్నేసింది. నిన్న గుజరాత్‌తో మ్యాచులో విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.


