News February 9, 2025
భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి: ASF కలెక్టర్

భూ భారతి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తహశీల్దార్‌ను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు రెబ్బెన మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా జారీ చేయాలని ఆదేశించారు.
Similar News
News March 23, 2025
BRS రజతోత్సవ వేడుకలపై నేడు కేటీఆర్ సమీక్ష

TG: కరీంనగర్‌లో నేడు జరగనున్న BRS రజతోత్సవ సన్నాహక సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల నుంచి ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి రానున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వచ్చే నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై సమీక్షించడంతో పాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
News March 23, 2025
సంగారెడ్డి: పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ చేసిన కలెక్టర్

సదాశివపేట మండలం నాగసాన్ పల్లి పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం జారీ చేశారు. గ్రామంలో ఫైనల్ నోటిఫికేషన్ చేయకుండానే వెంచర్లకు అనుమతి ఇచ్చారని, కొందరు డీపీవోకు ఫిర్యాదు చేశారు. డీపీవో విచారణ నివేదిక ఆధారంగా పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
News March 23, 2025
NZB: చెల్లి మృతి.. బాధలోనూ పరీక్ష రాసిన అన్న

ఓ వైపు చెల్లి మరణం.. మరో వైపు ‘పది’ పరీక్షలు. ఆ పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాశారు నిజామాబాద్‌కు చెందిన లక్ష్మీ గణ సాయి. ఆదర్శనగర్‌లోని పానుగంటి సాయిలు-వినోద దంపతులకు కుమారుడు లక్ష్మీ గణ సాయి, కుమార్తె పల్లవి సంతానం. అయితే పల్లవి 2 నెలల క్రితం క్యాన్సర్ బారినపడి శుక్రవారం రాత్రి మరణించగా, ఆ వార్త దిగమింగుకొని అన్న శనివారం పదో తరగతి పరీక్ష రాశారు. దుఃఖంలోనూ పరీక్ష రాసిన అన్న గ్రేట్ కదా..!