News April 15, 2025
భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా మద్దూరు మండలం ఎంపిక

భూభారతిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సమావేశానికి నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ హాజరయ్యారు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ సదస్సులను జిల్లాలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు.
Similar News
News November 17, 2025
చాంద్రాయణగుట్ట పేరు ఎలా వచ్చిందో తెలుసా?

చాళుక్యుల కాలంలో పాతబస్తీలోని ఎత్తైన కొండపై స్వయంభు లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం ఉండేదని ఇక్కడివారు చెబుతారు. ఆ కాలంలో ఈ కొండను చిన్నరాయి గుట్టగా పిలిచేవారట. తర్వాత కాలక్రమంలో చిన్నరాయిగుట్ట అనే పిలుస్తూనే.. చాంద్రాయణగుట్టగా మారిపోయింది. ఈ పవిత్ర గుట్టను ఇంకా కొంతమంది కేశవగిరి అని కూడా పిలుస్తారు.

కర్నూలు: కేంద్ర మంత్రి మనోహర్ లాల్కు ఘన స్వాగతం

కర్నూలు జిల్లా పర్యటన నిమిత్తం కేంద్ర విద్యుత్, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ సోమవారం విచ్చేశారు. ఓర్వకల్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి గెస్ట్ హౌస్కు చేరుకొని జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.