News April 15, 2025
భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా మద్దూరు మండలం ఎంపిక

భూభారతిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సమావేశానికి నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ హాజరయ్యారు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ సదస్సులను జిల్లాలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు.
Similar News
News April 25, 2025
‘సారంగపాణి జాతకం’ రివ్యూ&రేటింగ్

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూప జంటగా తెరకెక్కిన చిత్రం ‘సారంగపాణి జాతకం’ థియేటర్లలో విడుదలైంది. జాతకాలను నమ్మే హీరో పెళ్లి చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనేది సినిమా స్టోరీ. ప్రియదర్శి సహజ నటన, వెన్నెల కిశోర్, వైవా హర్ష కామెడీ మెప్పిస్తాయి. హీరోయిన్ రూప యాక్టింగ్, ఇంద్రగంటి రచన ఆకట్టుకుంటాయి. కాస్త స్లోగా అనిపించడం, ఊహించేలా కథ సాగడం మైనస్.
WAY2NEWS RATING: 2.75/5.
News April 25, 2025
యుద్ధ భయం.. భారీగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్

ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమవుతోంది. ఉదయం నుంచే మందకొడిగా సాగిన సూచీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 567 పాయింట్లు కోల్పోయి 79,234వద్ద సాగుతోంది, నిఫ్టీ 200పాయింట్ల నష్టంతో 24,045వద్ద ట్రేడవుతోంది. భారత్-పాకిస్థాన్ యుద్ధ భయం నేపథ్యంలో మార్కెట్ కుదేలవుతోంది.
News April 25, 2025
రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022, నవంబరు 17న భారత్ జోడో యాత్రలో దివంగత సావర్కర్‌ను ‘బ్రిటిష్ ఏజెంట్’గా రాహుల్ అభివర్ణించారు. ఆ వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం మండిపడింది. స్వాతంత్ర్య సమరయోధుల్ని అవమానిస్తే చూస్తూ ఉండబోమని తేల్చిచెప్పింది. ఇది మళ్లీ రిపీటైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.