News March 7, 2025

భూ యజమానుల సమక్షంలో రీ సర్వే చేయాలి: కలెక్టర్

image

భూ యజమానుల సమక్షంలో రీ సర్వే సక్రమంగా చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం, సిరిపురం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలను, మందపాడు గ్రామంలో పంట పొలాల రీ సర్వేను, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్న సర్వేలను ఫీల్డ్‌కి వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాసు పాల్గొన్నారు.

Similar News

News March 15, 2025

గుంటూరు ఛానల్‌లో గల్లంతైన బాలుడి మృతి 

image

పెదకాకాని మండలం నంబూరులోని గుంటూరు ఛానల్‌లో శుక్రవారం గల్లంతైన బాలుడు మృతి చెందాడు. స్థానిక అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన ప్రొక్లెయినర్‌ డ్రైవర్‌ ఏసురత్నం, సాంబమ్మ దంపతుల 2వ కుమారుడు జాషువా(12) స్థానిక జడ్పీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవు కావడంతో గుంటూరు ఛానల్‌కు వెళ్లాడు. సరదాగా నీటిలో దిగుదామనే ప్రయత్నం చేస్తుండగా కాలుజారి కాలువలో పడి గల్లంతై మరణించాడు. 

News March 15, 2025

మేడికొండూరు: బాలికపై 65ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి 

image

మేడికొండూరు మండలం పేరేచర్ల ఎస్సీ కాలనీకి చెందిన 65 ఏళ్ల దేవరకొండ రామారావు అదే కాలనీలోని తన స్నేహితుడు ఇంటికి శుక్రవారం వెళ్లాడు. ఇంటిలో బాలిక మాత్రమే ఉండడంతో లైంగిక దాడికి యత్నించాడు. అతనితో పెనుగులాడిన బాలిక పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. ఇది తెలిసిన బాధితురాలి బంధువులు మేడికొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

News March 15, 2025

తుళ్లూరు: పోలీసులతో పటిష్ట బందోబస్తు

image

వెంకటపాలెంలో నేడు జరగబోవు శ్రీవారి కల్యాణానికి వెయ్యి మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ వద్ద సిబ్బందికి పలు సూచనలు చేశారు. బంధువు పొత్తు నిర్వహణకు వీలుగా సభా ప్రాంగణాన్ని సెక్టార్లుగా విభజించి ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌ఛార్జ్ లుగా నియమించామని చెప్పారు.

error: Content is protected !!