News July 18, 2024

భూ వివాదం.. మహిళపై దాడి

image

భూ వివాదంలో ఓ మహిళపై మాజీ ఉపసర్పంచ్ దాడిచేసిన ఘటన పెద్దవూర మండలం తేప్పలమడుగులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జానపాటి సునీతపై మాజీ ఉపసర్పంచ్ పల్లెబోయిన శంకర్, అతని కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో NLGలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు స్పందించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.

Similar News

News October 30, 2025

తుఫాను.. అధికారులకు సెలవులు రద్దు: నల్గొండ కలెక్టర్

image

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లా అధికారులకు సెలవులు రద్దు చేస్తూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి సిబ్బంది అనుమతి లేకుండా సెలవుపై వెళ్లవద్దని, విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

News October 30, 2025

నల్గొండ: తుఫాను.. సహాయక చర్యలపై సీఎం వీసీ

image

మొంథా తుఫాను ప్రభావం, సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో నల్గొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. తుఫాను దృష్ట్యా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 27 నుంచే 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

News October 30, 2025

సైకిల్ ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఎన్.జి. కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఆయన పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారి ఆత్మ శాంతికి ప్రార్థనలు చేశారు.