News September 3, 2024
భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ గ్రామాల్లో ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న భూసమస్యల పరిష్కారానికి ఓ చక్కటి అవకాశమని కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ హాలులో ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల ప్రణాళిక, కార్యాచరణపై ఎంఎల్ఏ వరదరాజులు రెడ్డి, జేసీ అదితి సింగ్, డిఆర్వో గంగాధర్ గౌడ్తో కలిసి సమావేశం నిర్వహించారు.
Similar News
News December 25, 2025
మైదుకూరులో గుండెపోటుతో యువ వైద్యుడు మృతి

మైదుకూరు పట్టణం బద్వేల్ రోడ్డుకు చెందిన యువ వైద్యుడు శశికాంత్ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన మృతి చెందడం పట్ల మైదుకూరు పట్టణ వాసులు, పరిసర ప్రజలు విచారం వ్యక్తం చేశారు. కాగా ఈయన తండ్రి డాక్టర్ రంగ సింహ ఇటీవలే వయో భారం కారణంగా మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు వైద్యులు మృతి చెందడంతో పట్టణవాసులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈయన ఉన్నత వైద్య విద్యను అభ్యసించారు.
News December 25, 2025
క్యాలెండర్ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ క్రిస్మస్ సందర్భంగా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఏసుప్రభువును ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News December 25, 2025
జగన్కు ముద్దు పెట్టిన విజయమ్మ

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ తరుణంలో జగన్ తల్లి విజయమ్మ ఆయనకు కేక్ తినిపించి ముద్దు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి.


