News March 18, 2025

భూ సేకరణ త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్

image

తిరుపతి జిల్లా పరిధిలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో భూసేకరణ సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ రహదారు నిర్మాణాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ శుభం బన్సల్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 23, 2025

వరంగల్: నగలతో ఉడాయించిన నిత్య పెళ్లికూతురు..!

image

పెళ్లయి 16 ఏళ్ల కూతురు ఉన్నా తనకింకా పెళ్లి కాలేదని నమ్మించింది. పలు మ్యాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్ పెట్టి అమాయకులను పెళ్లి చేసుకొని, అనంతరం అందినకాడికి డబ్బు, నగలతో ఉడాయిస్తున్న నిత్య పెళ్లికూతురు తాజాగా తన ప్రతాపాన్ని చూపించింది. వరంగల్(D) పర్వతగిరి(M)లోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని గత నెలలో పెళ్లిచేసుకుని ఇంట్లో ఉన్న నగలతో పదిరోజుల క్రితం పరారైనట్లు సమాచారం. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

News November 23, 2025

తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

image

తిరుపతి SP ఆఫీసులో సోమవారం జరగాల్సిన PGRS (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు SP సుబ్బరాయుడు తెలిపారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పంచమి తీర్థం (చక్రస్నానం) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని SP కోరారు.

News November 23, 2025

5వ బాలోత్సవం లోగో, బ్రోచర్ ఆవిష్కరణ: కలెక్టర్

image

మాంటిస్సోరి ఇండస్ పాఠశాలలో డిసెంబర్ 9, 10వ తేదీల్లో జరగనున్న 5వ బాలోత్సవం-2025 సన్నాహకాలు వేగంగా జరుగుతున్నాయి. బాలోత్సవానికి ప్రతీకగా రూపొందించిన అధికారిక లోగోను కలెక్టర్ డా.సిరి ఆవిష్కరించారు. బాలోత్సవం పిల్లల సృజనాత్మకత, ప్రతిభ, నాయకత్వ నైపుణ్యాలను వెలికితీయడానికి ముఖ్య వేదికగా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. అలాగే పోటీలు, విభాగాలు, తేదీలు, నిబంధనలు, నమోదు చేయాలన్నారు.