News October 26, 2024
భృూణ హత్యలు జరగకుండా ప్రజలను చైతన్య పరచాలి: కలెక్టర్ పమేలా

భ్రూణ హత్యలు జరగకుండా ప్రజలను చైతన్య పర్చాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. ఆడ, మగ ఇద్దరినీ ఒకేలా చూడాలని చెప్పారు. ప్రతి శుక్రవారం జరిగే సభలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, లేక ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
Similar News
News October 14, 2025
17న కరీంనగర్లో క్యాంపస్ ఎకో బజార్ ఫర్ స్వదేశీ దీపావళి కార్యక్రమం

కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ‘FERIA FIESTA 2 – SWADESI UTSAV’ (క్యాంపస్ ఎకో బజార్ ఫర్ స్వదేశీ దీపావళి) పేరుతో ఈ నెల 17న కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం FERIA FIESTA 2 – SWADESI UTSAV పోస్టర్ను శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ యు.ఉమేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి. వరలక్ష్మి తదితరులున్నారు.
News October 13, 2025
KNR: యూనిసెఫ్ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

యూనిసెఫ్ సహకారంతో జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చేపట్టనున్న కార్యక్రమాలపై కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15న గ్లోబల్ హ్యాండ్ వాష్ డే నిర్వహణ, స్వచ్ఛ హరిత విద్యాలయాల నమోదు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
News October 13, 2025
కరీంనగర్: ప్రజావాణికి 271 దరఖాస్తులు

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 271 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అ.కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, RDOలు పాల్గొన్నారు.