News October 26, 2024
భృూణ హత్యలు జరగకుండా ప్రజలను చైతన్య పరచాలి: కలెక్టర్ పమేలా
భ్రూణ హత్యలు జరగకుండా ప్రజలను చైతన్య పర్చాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. ఆడ, మగ ఇద్దరినీ ఒకేలా చూడాలని చెప్పారు. ప్రతి శుక్రవారం జరిగే సభలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, లేక ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
Similar News
News November 12, 2024
వేములవాడ : ఈనెల 13 నుంచి 15 వరకు అభిషేకాలు రద్దు
దక్షిణ కాశిగా పేరొందిన ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 13 నుంచి 15 అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నపూజలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఈ విషయం భక్తులు గమనించి సహకరించగలరని కోరారు.
News November 12, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ధర్మారం మండలంలో విద్యుత్ షాక్ తో ఒకరికి తీవ్ర గాయాలు. @ శంకరపట్నం మండలంలో కారు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ సిరిసిల్ల కార్గిల్ లేఖలో దూకి వ్యక్తి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ రేపు జగిత్యాలకు రానున్న మాజీ మంత్రి హరీష్ రావు. @ జగిత్యాల జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించిన కలెక్టర్. @ సిరిసిల్ల ప్రజావాణిలో 123 ఫిర్యాదులు.
News November 11, 2024
రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి పొన్నం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం రాత్రి 11:55గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్‌పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈరోజు సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.